బాలయ్య అక్కినేనిని విమర్శించడం తప్పే – మంత్రి రోజా

నందమూరి బాలకృష్ణ వీర సింహ రెడ్డి సక్సెస్ మీట్ లో అక్కినేని ఫై చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికీ తప్పే అన్నారు మంత్రి రోజా. పాత సినిమాలకు సంబంధించిన విషయాల గురించి బాలకృష్ణ మాట్లాడుతూ.. అక్కినేని.. ‘తొక్కినేని’ అంటూ మాట్లాడాడు. దీంతో బాలయ్య వ్యాఖ్యల ఫై సోషల్ మీడియా లో ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో అక్కినేని మనవాళ్లు నాగచైతన్య , అఖిల్ సైతం ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు.

నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎస్వీ రంగారావు గారు తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలు. వారిని అగౌరవపరచడం మనల్ని మనమే కించపరుచుకోవడం…’ అంటూ ట్వీట్ చేశారు. ఇక ఇప్పుడు సినీ నటి , వైస్సార్సీపీ మంత్రి రోజా సైతం బాలకృష్ణ వ్యాఖ్యలను తప్పుపట్టారు. బాలయ్య చేసిన వ్యాఖ్యలు సరికాదని.. ఎన్టీఆర్‌ను విమర్శిస్తే ఆయన ఊరుకుంటారా అని ప్రశ్నించారు. బాలకృష్ణ అక్కినేనిని అవమానించడం తప్పని.. ఎన్టీఆర్‌ని అవమానిస్తే వీళ్ళు ఎంత బాధ పడతారో.. అలాగే అక్కినేని అభిమానులు కూడా బాధపడతారన్నారు. ఆ విషయంపై ఇప్పటి వరకూ బాలకృష్ణ తప్పును సరిదిద్దుకోలేదని.. ఎప్పుడూ సరిదిద్దుకోరన్నారు.