తప్పుడు ఆరోపణలు చేస్తే చివరకు మీరే ఫూల్స్ అవుతారుఃమంత్రి రోజా

minister-roja

అమరావతిః మంత్రి రోజు మరోసారి టిడిపి పై విమర్శలు గుప్పించారు. ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారాన్ని అడ్డం పెట్టుకుని నెల రోజుల నుంచి టిడిపి రాజకీయం చేస్తోందని రోజా మండిపడ్డారు. అవసరం లేని విషయాలపై రాద్ధాంతం చేస్తోందని చెప్పారు. తప్పుడు ఆరోపణలు చేస్తే చివరకు మీరే ఫూల్స్ అవుతారని అన్నారు. ఇప్పుడు అన్నా క్యాంటీన్ల విషయంలో కూడా రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికలకు మూడు, నాలుగు నెలల ముందు అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేశారని… ఎన్టీఆర్ మీద అంత అభిమానం ఉంటే అధికారంలోకి వచ్చిన వెంటనే క్యాంటీన్లను పెట్టాల్సిందని అన్నారు. ఎన్నికలకు ముందు క్యాంటీన్లను పెట్టి… క్యాంటీన్లను మేము పెట్టాం, మీరు తీసేశారంటూ రాజకీయ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అన్నా క్యాంటీన్ల విషయంలో కోడిగుడ్డు మీద ఈకలు పీకే రాజకీయాన్ని టిడిపి చేస్తోందని అన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/