నేడు కార్గిల్లో పర్యటించనున్ను మంత్రి రాజ్నాథ్ సింగ్

న్యూఢిల్లీ: 1999లో జరిగిన కార్గిల్ యుద్ధ విజయానికి గుర్తుగా ప్రతి ఏడాది జూలై 26న కార్గిల్ విజయ్ దివస్ను నిర్వహించుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు కార్గిల్లో పర్యటించనున్నారు. జూలై 26న నిర్వహించుకునే కార్గిల్ విజయ్ దివస్ నేపథ్యంలో యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన అమరులకు రాజ్నాథ్ సింగ్ నివాళులర్పించనున్నారు. ఈ విషయాన్ని తన అధికార ట్విట్టర్ ఖాతా ద్వారా కేంద్రమంత్రి స్వయంగా వెల్లడించారు. అనంతరం బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జమ్ములో నిర్మించిన రెండు వంతెనలను జాతికి అంకితం చేయనున్నట్లు ట్విట్టర్లో తెలిపారు.
తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/movies/