రష్యాకు బయలుదేరిన మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌

రష్యాలో మూడు రోజులపాటు పర్యటించనున్న రాజ్‌నాథ్‌ సింగ్‌

రష్యాకు బయలుదేరిన మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌
Rajnath Singh leaves for Russia

న్యూఢిల్లీ: రష్యాలోని మాస్కోలో నిర్వహించే రెండో ప్రపంచ యుద్ధం 75వ విజయోత్సవ పరేడ్‌లో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పాల్గొననున్నారు. ఈనేపథ్యలో ఆయన ఈరోజు రష్యాకు బయలుదేరారు. వాయుసేనకు చెందిన ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి ప్రయాణమయ్యారు. ఈక్రమంలో రాజ్‌నాథ్‌ సింగ్‌ రష్యాలో మూడు రోజులపాటు పర్యటించనున్నారు. కాగా రష్యా, భారత్‌ మధ్య బలమైన సంబంధాలతోపాటు రక్షణ, వ్యూహాత్మక భాగస్వామ్యం వంటి అంశాలపై ఆ దేశ పాలకులతో చర్చిస్తారు. ఆయన వెంట రక్షణ శాఖ కార్యదర్శి కూడా ఉన్నారు. రష్యాకు బయలుదేరే ముందు.. మూడు రోజుల పర్యటనకు మాస్కోకు వెళ్తున్నట్లు రాజ్‌నాథ్‌ సింగ్ ట్వీట్‌ చేశారు. రష్యాతో రక్షణ, వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చలు జరుపనున్నట్లు ఆయన పేర్కొన్నారు. సరిహద్దులో చైనాతో ఘర్షణ నెలకొన్న తరుణంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ రష్యా పర్యటన ప్రాధాన్యత సంతరించుకున్నది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/