గంగమ్మకు మంత్రి పువ్వాడ ప్రత్యేక పూజలు

గంగమ్మకు హార‌తిచ్చిన..మంత్రి పువ్వాడ

minister-puvvada-ajay-kumar-performs-special-puja-to-godavari-river

హైదరాబాద్ః భారీ వర్షాల కారణంగా ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రూపం దాల్చింది. దీంతో రాములవారి పాదాల చెంత 70 అడుగుల ఎత్తులో ప్రవహహిస్తున్నది. ఈ నేపథ్యంలో భద్రాచలంలో గోదావరి వరద తగ్గాలని మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉగ్రగోదావరి శాంతించాలని నది స్నానఘట్టాల వద్ద వేదపండితులు, అర్చకులు, ఆలయ అధికారులతో కలిసి గోదారమ్మకు హారతులు ఇచ్చారు. మంత్రి వెంట పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు ఉన్నారు.

కాగా, భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం కొద్దిగా తగ్గింది. ఉదయం వరకు 71.20 అడుగులగా ఉన్న నీటిమట్టం ఉదయం 8 గంటలకు 90.70కు చేరింది. వరద ఉధృతి తగ్గడంతో ఎగువన ఉన్న ప్రాజెక్టుల గేట్లను అధికారులు మూసివేస్తున్నారు. దీంతో భద్రాచలానికి క్రమంగా నీటిప్రవాహం నెమ్మదిస్తున్నది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/