మంత్రి పేర్ని నానికి మాతృవియోగం

perni nani
perni nani

విజయవాడ: ఏపి మంత్రి పేర్ని నానికి మాతృవియోగం కలిగింది. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పేర్ని తల్లి నాగేశ్వరమ్మ(82) ఈరోజు తుదిశ్వాస విడిచారు. రెండ్రోజుల క్రితమే ఆంధ్రా హాస్పిటల్ నుంచి నాగేశ్వరమ్మ డిశ్చార్జ్ అయ్యారు. ఉదయం మరోసారి నాగేశ్వరమ్మ అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. కొద్దిసేపటికే నాగేశ్వరమ్మ చికిత్స పొందుతూ మృతి చెందారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/