మంత్రి నిరంజన్‌రెడ్డి తల్లి కన్నుమూత

Minister Niranjan Reddy with mother
Minister Niranjan Reddy with mother

వనపర్తి: తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తల్లి సింగిరెడ్డి తారకమ్మ(105) ఈరోజు ఉదయం తుడిశ్వాస విడిచారు. అనారోగ్య కారణంగా చనిపోయిందని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు నిరంజన్ రెడ్డి స్వగృహానికి చేరుకొని సానుభూతి ప్రకటిస్తున్నారు. ఇంట్లో పెద్దావిడ చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమన్నీరవుతున్నారు. ప్రముఖ రాజకీయ నాయుకులు, టిఆర్ఎస్ నాయకులు వేలాదిగా నిరంజన్ రెడ్డి ఇంటికి చేరుకుంటున్నారు. ఇవాళ సాయంత్ర తన స్వగ్రామంలో తారకమ్మ అంత్య క్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/