తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి

జర్మనీ పర్యటనలో ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి

Niranjan Reddy
Niranjan Reddy

జర్మనీ: తెలంగాణ రాష్ట్రం విత్తనోత్పత్తికి అనుకూలంగా ఉందని, యూరప్‌ విత్తన కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి కోరారు. జర్మనీ పర్యటనలో ఉన్న ఆయన తెలంగాణ రాష్ట్రంలో చేపడుతున్న కార్యక్రమాలను అక్కడి ప్లాంట్‌ బ్రీడర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులకు వివరించారు. యూరప్‌ కంపెనీలు చైనా విత్తన రంగంలో పెట్టుబుడులు పెడుతున్నాయని, తెలంగాణ రాష్ట్రంలో నాణ్యమైన విత్తనోత్పత్తికి, ప్రాసెసింగ్‌కు అనుకూలా వాతావరణ పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/