లూలూసంస్థతో చేసుకున్న ఒప్పందం రద్దు

Mekapati Goutham Reddy
Mekapati Goutham Reddy

అమరావతి: విశాఖ నగరానికి కన్వెన్షన్‌, షాహింగ్‌హబ్‌గా తీర్చిదిద్దేందుకు గత టిడిపి ప్రభుత్వం లూలూ సంస్థ చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేస్తూ వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కాగా విశాఖలోని లూలూ గ్రూపునకు కేటాయించిన భూమిపై న్యాయ వివాదం ఉందని, అందుకే ఆ సంస్థకు కేటాయించిన భూములను రద్దు చేశామని మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రెండు కారణాలతో లూలూ గ్రూపుతో ఒప్పందం రద్దుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. లూలూ గ్రూపుతో ప్రభుత్వానికి ఏటా రూ.500 కోట్ల నష్టం వాటిల్లుతుందని, స్థలం విషయంలోనూ వివాదాలు ఉన్నాయని మంత్రి తెలిపారు. వివాదస్పద భూములను గత టిటిపి ప్రభుత్వం లూలూ సంస్థకు కేటాయించదన్నారు. విశాఖలో కేవలం కన్వెన్షన్‌ సెంటర్‌ ఏర్పాటుకు మాత్రమే లూలూ గ్రూపు ముందుకొచ్చిందని దానిని ప్రభుత్వం కూడా నిర్మించకోగలదని మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/