మంత్రి మల్లారెడ్డి కుమారుడికి అస్వస్థత..హాస్పటల్ కు తరలింపు

మంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను సూరారం లోని హాస్పటల్ కు తరలించారు. నిన్నటి నుండి మల్లారెడ్డి ఇంటి ఫై ఆఫీస్ లపై ఐటీ దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. సోదాల నేపథ్యంలో నిన్న మహేందర్ రెడ్డి ఇంట్లోనే ఉండిపోయారు. ఈ క్రమంలోనే ఆయనకు ఛాతీ నొప్పి వచ్చింది.

మరోవైపు ఈరోజు కూడా వీరి నివాసాలు, కార్యాలయాల్లో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. నిన్న అర్ధరాత్రి వరకు సోదాలు కొనసాగాయి. నిన్న రాత్రి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న వారి ఇళ్లలోనే పడుకున్నారు. నిన్నటి సోదాల్లో కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. రూ. 4 కోట్ల నగదును కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో నా కొడుకును ఐటీ అధికారులు కొట్టారని మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఛాతి నొప్పి రావడంతో మహేందర్‌రెడ్డిని.. సురారంలోని ఆస్పత్రికి తరలించారు. ఆ తరుణంలోనే.. తన కొడుకు మహేందర్ రెడ్డిని చూసేందుకు సూరారంలోని ఆస్పత్రికి వెళ్లారు మంత్రి మల్లారెడ్డి. మంత్రితో పాటు ఆస్పత్రికి ఐటీ అధికారులు వెళ్లారు. ఈ సందర్భంగా మీడియాతో మల్లారెడ్డి మాట్లాడుతూ.. మేమేం దొంగ వ్యాపారాలు చేయడం లేదని ఆగ్రహించారు. నా కొడుకును ఐటీ అధికారులు కొట్టారని.. అందుకే ఆస్పత్రి పాలయ్యాడని నిప్పులు చెరిగారు. 200 మంది ఐటీ అధికారులు దాడులు చేసారని ఆగ్రహించారు మంత్రి మల్లారెడ్డి.