విద్యార్థులపై వేధింపులకు పాల్పడిన వారిని ఉపేక్షించం

వేధింపులకు గురైన తొమ్మిది విద్యార్థులను పరామర్శించిన కెటిఆర్‌

K. T. Rama Rao
K. T. Rama Rao

సిరిసిల్ల: విద్యార్థులపై వేధింపులకు పాల్పడిన వారిని ఉపేక్షించే ప్రసక్తేలేదని మంత్రి కెటిఆర్‌ స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఎస్సీ బాలికల హాస్టల్ ను కెటిఆర్‌ గురువారం సందర్శించారు. వేధింపులకు గురైన తొమ్మిది విద్యార్థులను ఆయన పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని అధికారులను కెటిఆర్‌ ఆదేశించారు. ఇప్పటికే దేవయ్యను పోలీసులు అరెస్ట్‌ చేశారని తెలిపారు.విద్యార్థులు స్వంత హాస్టల్‌ భవనం కావాలని కోరారని త్వరలో నిర్మిస్తామని కెటిఆర్‌ వెల్లడించారు. జిల్లాలోని అన్ని బాలికల హాస్టల్‌లో ఆత్మరక్షణ కోసం సెల్ఫ్‌ డిఫెన్స్‌ శిక్షణ ఇవ్వాలని నిర్ణయించామని పేర్కొన్నారు. నిరంతరాయంగా శిక్షణ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని కలెక్టర్‌,ఎస్పీలను ఆదేశించామని చెప్పారు. భవిష్యత్తులో సిరిసిల్ల హాస్టల్‌లో జరిగిన సంఘటనలు పునరావృత్తం కాకుండా చర్యలు చేపడుతున్నామని మంత్రి
కెటిఆర్‌ పేర్కొన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/