మంత్రి కెటిఆర్ ఖైరతాబాద్‌లో పర్యటన

హైదరాబాద్: రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మూడో రోజు పర్యటిస్తున్నారు. ఖైరతాబాద్‌లోని బీఎస్ మక్తా కాలనీలో ఈరోజు ఉదయం కెటిఆర్ పర్యటించి..వరద బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన షెల్టర్ హోమ్‌ని కెటిఆర్ పరిశీలించి.. అక్కడ అందిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పడటంతో.. పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు కెటిఆర్ సూచించారు. ముంపు బాధితులందరికి రేషన్ బియ్యంతో పాటు ఇతర నిత్యవసరాలు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. గోరు వెచ్చని నీటిని తాగాలని ప్రజలకు కెటిఆర్ సూచించారు. ప్రజలకు అవసరమైన వైద్య సదుపాయాన్ని అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. షెల్టర్ హోమ్‌లో ఉంటున్న వారికి ఆహారంతో పాటు దుప్పట్లు అందిస్తున్నామని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/