కేంద్ర ప్ర‌భుత్వంపై మంత్రి కేటీఆర్ విమర్శలు

హైదరాబాద్: మంత్రి కేటీఆర్ కేంద్ర ప్ర‌భుత్వంపై సెటైరిక‌ల్ ట్వీట్ చేశారు. దేశ ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తూ, తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న కేంద్రంపై కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు. దేశానికి కావాల్సింది డ‌బుల్ ఇంపాక్ట్ పాల‌న అని చెప్పారు. ప‌నికిరాని డ‌బుల్ ఇంజిన్లు కాదు అని కేటీఆర్ తెలిపారు. దేశ జ‌నాభాలో 2.5 శాతం ఉన్న తెలంగాణ‌.. దేశ జీడీపీకి 5.0 శాతం కంట్రిబ్యూట్ చేస్తోంద‌ని కేటీఆర్ గుర్తు చేశారు. ఈ గ‌ణాంకాలు 2021, అక్టోబ‌ర్‌లో ఆర్‌బీఐ విడుద‌ల చేసిన నివేదిక‌లోనివే అని కేటీఆర్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/