కేంద్ర సర్కార్ ప్రణాళికా లోపంతో దేశీయంగా బొగ్గు కొరత ఏర్పడింది – కేటీఆర్

టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మరోసారి కేంద్రం ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. దేశీయంగా బొగ్గు కొరత ఏర్పడడం ఫై ట్విట్టర్ వేదికగా కేంద్రం ఫై నిప్పులు చెరిగారు.

మోడీ సర్కార్‌ ప్రణాళికా లోపం.. ముందుచూపు లేక దేశీయంగా బొగ్గు కొరత ఏర్పడిందని కేటీఆర్ విమర్శించారు. దీంతో 10 రెట్లు ఎక్కువ విలువైన విదేశీ బొగ్గును దిగుమతి చేసుకోక తప్పనిసరి పరిస్థితి నెలకొందన్నారు. బొగ్గు దిగుమతి చేసుకోవడంతో తదుపరి విద్యుత్ టారిఫ్ పెరుగుతుందన్న మంత్రి… ఇందుకు ఎవరికి కృతజ్ఞతలు చెప్పాలో తెలుసా అంటూ ట్వీట్‌ చేశారు. ఇదే సమయంలో దేశంలో మరో వందేళ్లకు సరిపడా బొగ్గు నిల్వలున్నాయని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

ప్రస్తుతం కేటీఆర్ తన కాలికి గాయం కావడం తో ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటూ..రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు , వరదల ఫై ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షా నిర్వహిస్తూ చర్యలు తీసుకుంటున్నారు.