నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను

తన ఆరోగ్యంపై వివరణ ఇచ్చిన మంత్రి కెటిఆర్‌

ktr
ktr

హైదరాబాద్‌: తెలంగాణ ఐటీ, మన్సిపల్‌శాఖ మంత్రి కెటిఆర్‌ తన ఆరోగ్యానికి సంబంధించి వివరణ ఇచ్చిరు. తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని ప్రకటించారు. తన ఆరోగ్యంపై ఆందోళన చెందొద్దని ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశారు. నిన్నటి నుంచి తన ఆరోగ్యంపై ఆందోళన చెందిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. తనకు ఎలాంటి ఇబ్బంది లేదని.. తాను బాగానే ఉన్నానన్నారు. సిరిసిల్లలో సోమవారం నాటి పర్యటన సందర్భంగా తనకు అనేక సంవత్సరాలుగా ఉన్న జలుబుకు సంబంధించిన ఎలర్జీ వచ్చిందన్నారు. అప్పటికే పర్యటనకు సంబంధించిన పలు కార్యక్రమాలు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో.. ఎవరికీ ఇబ్బంది కలగొద్దన్న ఉద్దేశంతో కార్యక్రమాన్ని కొనసాగించాల్సి వచ్చిందన్నారు.


తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/