నేడు నారాయణపేటలో పర్యటించనున్నమంత్రి కేటీఆర్‌

హైదరాబాద్ : నారాయణపేట జిల్లాలో నేడు మంత్రి కేటీఆర్‌ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. ఇందులో భాగంగా నారాయణపేట ప్రభుత్వ దవాకాణలో 10 ఐసీయూ పడకలు, 3 వెంటిలేటర్లతో కూడిన పిల్లల వార్డును మంత్రి ప్రారంభిస్తారు. అనంతరం రూ.6 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న వెజ్, నాన్​వెజ్​ మార్కెట్‌కు శంకుస్థాపన చేస్తారు. రూ.20 లక్షలతో నిర్మించే అమరవీరుల స్మారక ఉద్యానవనం, సింగారం క్రాస్​రోడ్డులో చేనేత శిక్షణ, ఉత్పత్తి కేంద్రం, అంబేద్కర్ చౌరస్తా సుందరీకరణ పనులకు శ్రీకారం చుడతారు. అదేవిధంగా పిల్లల సైన్స్ పార్కును ప్రారంభిస్తారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/