తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు మరో పెద్ద కంపెనీ

ఆర్ అండ్ డీ సెంటర్ ఏర్పాటుకు ‘థర్మోఫిషర్ సైంటిఫిక్’ అంగీకారం..మంత్రి కేటీఆర్

హైదరాబాద్: తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అమెరికాకు చెందిన ప్రఖ్యాత లైఫ్ సైన్సెస్ సంస్థ ‘థర్మోఫిషర్ సైంటిఫిక్’ ఆసక్తి చూపించిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆ సంస్థ హైదరాబాద్ లో ఆర్ అండ్ డీ సెంటర్ ను ఓపెన్ చేసేందుకు ముందుకు వచ్చిందన్నారు. సైంటిఫిక్ ల్యాబ్ పరికరాలు, రీ ఏజెంట్ల తయారీ, సరఫరా కోసం ఇండియా ఇంజనీరింగ్ సెంటర్ ఆపరేషన్లను హైదరాబాద్ నుంచే చేసేందుకు నిర్ణయించిందన్నారు. తద్వారా సంస్థ కూడా గ్లోబల్ గా ఎదిగేందుకు దోహదపడుతుందన్నారు.

కాగా, పెట్టుబడుల కోసం ఆ సంస్థ ప్రతినిధులతో ఇవాళ కేటీఆర్ సమావేశమయ్యారు. సంస్థలోని లైఫ్ సైన్సెస్ అండ్ లేబొరేటరీ ప్రొడక్ట్స్ గ్రూప్ గ్లోబల్ ఆపరేషన్స్ వీపీ జూలీ డివానే, సంస్థ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ వీపీ టై మోర్టెన్సన్ లతో పెట్టుబడులపై చర్చించారు. అతి త్వరలోనే హైదరాబాద్ లో ఆర్ అండ్ డీ సెంటర్ ఏర్పాటు చేసేందుకు వారు అంగీకరించారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/