శుభ్రత విషయంలో కఠినంగా వ్యవహరించాలి

పారిశుద్ధ్య పనుల కోసం ప్రణాళిక రుపొందించాలి

ప్రజా ప్రతినిధుల ఉద్యోగాలు పోవడం చట్టంలోనే ఉంది

ktr speech at khammam
ktr speech at khammam

ఖమ్మం: శుభ్రత విషయంలో కఠినంగా వ్యవహరించాలని పురపాలకశాఖ మంత్రి కెటిఆర్‌ అధికారులను ఆదేశించారు. ఖమ్మం నగరంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రతి కార్పొరేటర్‌ ఒక్కో కెసిఆర్‌ కావాలని, అప్పుడే పట్టణం రూపురేఖలు మారుతాయని అన్నారు. ప్రజల నుంచి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలి. పారిశుద్ధ్య పనుల కోసం ప్రణాళిక రొపొందించాలి. బహిరంగ మలమూత్ర విసర్జన జరగొద్దు. ఖాళీ స్థలాలు, కాల్వల్లో చెత్త వేస్తే చర్యలు చేపట్టాలని సూచించారు. రాబోయే రెండు మూడు నెలల్లో 400 ప్రజా మరుగుదొడ్లు నిర్మించాలన్నారు. పట్టణ, డివిజన్‌ గ్రీన్‌ యాక్షన్‌ ప్లాన్‌ తయారు చేయండి. ప్రజలు ఏ మొక్క వావాలంటే ఆ మొక్కలే అందించాలని తెలిపారు. 85 శాతం మొక్కలు కాపాడకపోతే కార్పొరేటర్‌ ఉద్యోగం పోతుంది. ప్రజాప్రతినిధుల ఉద్యోగాల పోవడం చట్టంలోనే ఉంది…దాన్ని ఎవరూ మార్చలేరు అని కెటిఆర్‌ స్పష్టం చేశారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/