నేడు సిరిసిల్లలో మంత్రి కేటీఆర్‌ పర్యటన

హైదరాబాద్: నేడు మంత్రి కేటీఆర్‌ సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించడంతోపాటు, శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 10.30 గంటలకు ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డిపల్లిలో గ్రామ పంచాయతి భవనం, అదనపు తరగతి గదులను ప్రారంభిస్తారు. ఉదయం 11 గంటలకు వెంకటాపూర్‌లో నూతనంగా నిర్మించిన రైతు వేదిక, కేసీఆర్ ప్రగతిప్రాంగణం ప్రారంభిస్తారు. అనంతరం డబుల్ బెడ్రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు అందిస్తారు.

తర్వాత బహిరంగ సభలో మంత్రి కేటీఆర్‌ పాల్గొంటారు. మధ్యాహ్నం 12:30 గంటలకు వేములవాడ పట్టణంలోని తిప్పాపురంలో 100 పడకల ఆస్పత్రి, హెల్త్ ప్రొఫైల్ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. అలాగే ఆక్సిజన్ ట్యాంక్, సీటీ స్కాన్, పల్లీయేటివ్ కేర్ సెంటర్, పీఎస్ఏ ప్లాంట్, పిడియాట్రిక్ వార్డ్ ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు వేములవాడ పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయ ఆవరణలో రూ.20 కోట్ల టీయూఎఫ్ఐడీసీ నిధులతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలో వెజ్ మరియు నాన్వెజ్ మార్కెట్‌ పనులను శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం గంటలకు వేములవాడ మండలం మర్రిపల్లిలో కొత్తగా నిర్మించిన రైతువేదిక, కేజీబీవీ భవనాలను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/