నేటి నుంచి పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రారంభం

ఈ నెల 24 నుంచి మార్చి 4 వరకు నిర్వహణ

Minister KTR
Minister KTR

హైదరాబాద్‌: తెలంగాణ అన్ని ఎన్నికలు పూర్తయి పోయాయి. ఇక ఇప్పుడు పాలనపై పూర్తిగా దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా ప్రభుత్వం ఇవాళ… పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలో ప్రారంభించబోతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కెటిఆర్ హాజరుకాబోతున్నారు. ఇందుకు సంబంధించి జెడ్పి గ్రౌండ్‌లో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. కార్యక్రమం ప్రారంభించాక కెటిఆర్ … కొన్ని అభివృద్ధి పనులను చేపడతారు. అదే సమయంలో తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. టిఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు అందరూ ఇందులో పాలుపంచుకోనున్నారు. తెలంగాణలో ఈ పది రోజులూ ఓ పండగ వాతావరణంలా… అంతా కళకళలాడుతూ రోజూ రకరకాల కార్యక్రమాలు జరుగుతూ సందడిగా ఉండబోతోంది. పది రోజుల తర్వాత సరికొత్త తెలంగాణ కనిపించే అవకాశం ఉంది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/