గ్రూప్ 4 ద్వారా వార్డు అధికారుల నియామకం ఓ వినూత్న చర్య: మంత్రి కెటిఆర్‌

సిఎం కెసిఆర్‌ కు ధన్యవాదాలు..కెటిఆర్

minister-ktr-thanks-cm-kcr-for-releasing-group-4-jobs-notification

హైదరాబాద్‌ః తెలంగాణ ప్రభుత్వం గ్రూప్ 4 నోటిఫికేషన్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. వివిధ శాఖలకు చెందిన 9,168 ఉద్యోగాలను గ్రూప్ 4 పరీక్షల ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ… గ్రూప్ 4 ద్వారా వార్డు అధికారుల నియామకం ఓ వినూత్న చర్య అని ప్రశంసించారు. గ్రూప్ 4 ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 141 మున్సిపాలిటీల్లో వార్డు ఆఫీసర్ల నియామయం జరుగుతుందని చెప్పారు. దీంతో పౌర సమస్యలపై మరింత దృష్టి సారించే అవకాశం కలుగుతుందని… కౌన్సిలర్లతో వార్లు అధికారులకు మంచి సమన్వయం నెలకొంటుందని తెలిపారు. గ్రూప్ 4 నోటిఫికేషన్ ఇచ్చిన ముఖ్యమంత్రి కెసిఆర్ కు ధన్యవాదాలు తెలుపుతున్నామని చెప్పారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/