ఏపీలోని రోడ్లన్నీ అధ్వాన్నంగా ఉన్నాయి: మంత్రి కేటీఆర్

ఏపీ పరిస్థితుల గురించి తన మిత్రులు చెప్పారన్న కేటీఆర్


హైదరాబాద్: మాదాపూర్‌ హైటెక్స్‌లో జరుగుతున్న క్రెడాయ్‌ ప్రాపర్టీ షోను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఏపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో కరెంట్ లేదు, నీళ్లు లేవు లేవని విమర్శించారు. ఏపీలోని రోడ్లన్నీ అధ్వాన్నంగా ఉన్నాయని అన్నారు. ఏపీలోని సొంతూళ్లకు వెళ్లొచ్చిన తన మిత్రులు ఈ విషయాన్ని తనతో చెప్పారని… ఏపీలో ఉంటే నరకంలో ఉన్నట్టు ఉందంటున్నారని వ్యాఖ్యానించారు. బెంగళూరులోని కంపెనీలు కూడా ఏపీలోని అధ్వన్నపు రోడ్ల గురించి మాట్లాడుతున్నాయని అన్నారు. తెలంగాణ చాలా ప్రశాంతమైన రాష్ట్రమని… దేశంలోనే హైదరాబాద్ బెస్ట్ సిటీ అని చెప్పారు. తెలంగాణలో అభివృద్ధి ఎలా ఉందో ఏపీ ప్రజలకు అర్థమైందని తెలిపారు. నగరాల్లో మౌలిక సదుపాయాలను ఎప్పటికప్పుడు అభివృద్ధి చేయకపోతే వెనుకపడిపోతామని అన్నారు.

తెలంగాణ వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలకు మాస్టర్‌ ప్లాన్‌లు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. 18 నెలల్లో హైదరాబాద్‌కు కొత్త మాస్టర్‌ప్లాన్‌ తయారుకానుందని తెలిపారు. సొంత జాగా ఉన్నవారు ఇళ్లు కట్టుకుంటే రూ.3 లక్షలు ఇస్తున్నామని తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/