ట్విట్ట‌ర్ సీఈవో అగ‌ర్వాల్‌కు మంత్రి కేటీఆర్ శుభాకాంక్ష‌లు

హైదరాబాద్: గ్లోబల్‌ టెక్నా‌లజీ దిగ్గ‌జాలు వరు‌సగా భార‌తీ‌యుల సార‌థ్యం‌లోకి వస్తు‌న్నాయి. ప్రముఖ సోషల్‌ మీడియా సంస్థ ట్విట్టర్‌ పగ్గాలు భారత సంతతి టెక్కీ చేతికి వచ్చాయి. ట్విట్టర్‌ కొత్త సీఈ‌వోగా పరాగ్‌ అగ‌ర్వాల్‌ నియ‌మి‌తు‌ల‌య్యారు. ఈ సంద‌ర్భంగా ట్విట్ట‌ర్ సీఈవో ప‌రాగ్ అగ‌ర్వాల్‌కు రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ శుభాకాంక్ష‌లు తెలుపుతూ ట్వీట్ చేశారు. మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, అడోబ్‌, ఐబీఎం, మైక్రాన్, మాస్ట‌ర్ కార్డ్ సంస్థ‌ల్లో కామ‌న్ ఏంట‌ని కేటీఆర్ ప్ర‌శ్నించారు. ఈ అంత‌ర్జాతీయ కంపెనీల‌న్నింటికి ఇండియాలో పుట్టి పెరిగిన వారే సీఈవోలుగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆయ‌న పేర్కొన్నారు.

సీఈ‌వోగా ట్విట్టర్‌ సహ వ్యవ‌స్థా‌ప‌కుడు జాక్‌ డోర్సే సోమ‌వారం దిగి‌పో‌వ‌డంతో ఆయన స్థానంలో చీఫ్‌ టెక్ని‌కల్‌ ఆఫీ‌స‌ర్‌గా పని‌చే‌స్తున్న పరాగ్‌ అగ‌ర్వా‌ల్‌ను సంస్థ బోర్డు ఏక‌గ్రీ‌వంగా ఎన్ను‌కు‌న్నది. 2006లో మరో ముగ్గు‌రితో కలిసి డోర్సే ట్విట‌ర్‌ను స్థాపిం‌చిన విషయం తెలి‌సిందే. అప్ప‌ట్నుంచి ఇప్ప‌టి‌దాకా ట్విట్టర్‌ సార‌థిగా డోర్సేనే కొన‌సా‌గు‌తు‌న్నారు. దాదాపు 16 ఏండ్ల అనం‌తరం సంస్థకు కొత్త సీఈవో రాగా, అది‌కూడా ఓ భార‌తీ‌యు‌డికి అవ‌కాశం లభిం‌చడం గమ‌నార్హం. కాగా, 2022లో జరిగే సంస్థ వాటా‌దా‌రుల సమా‌వేశం వరకు డోర్సే ట్విట్టర్‌ బోర్డులో సభ్యు‌డిగా కొన‌సా‌గ‌ను‌న్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/