మిమ్మ‌ల్ని చూసి ఈ దేశం గ‌ర్వ పడుతుంది: మంత్రి కేటీఆర్

భార‌త హాకీ టీమ్‌కు మంత్రి కేటీఆర్ హృద‌య‌పూర్వ‌క శుభాకాంక్ష‌లు

దంతెవాడ : మంత్రి కేటీఆర్ టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య ప‌త‌కం సాధించిన భార‌త పురుషుల హాకీ టీమ్‌కు హృద‌య‌పూర్వ‌క శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ ట్వీట్ చేశారు. భార‌త హాకీ టీమ్ అద్భుత‌మైన చ‌రిత్ర‌ను సృష్టించింద‌ని కేటీఆర్ కొనియాడారు. మిమ్మ‌ల్ని చూసి ఈ దేశం గ‌ర్వ ప‌డుతుంద‌ని మంత్రి కేటీఆర్ అన్నారు.

కాగా, 1980 తర్వాత ఒలింపిక్స్‌ పతకాన్ని సాధించింది. ఆ సంవత్సరంలో స్వర్ణ పతకం గెలువగా.. ఆ తర్వాత పతకం గెలువడం ఇదే తొలిసారి. బుధవారం జర్మనీతో కాంస్య పతకం కోసం జరిగిన మ్యాచ్‌లో భారత క్రీడాకారులు సత్తా చాటారు. బలమైన ప్రత్యర్థిని భారత్‌ 5-4 తేడాతో చిత్తు చేసింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/