మోడీకి భాస్కర్ అవార్డు ఇవ్వాల్సిందే అంటూ కేటీఆర్ సెటైర్లు

KTR tweet to Modi
Minister KTR Satires On PM Modi

తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ మరోసారి మోడీ ఫై సెటైర్లు వేసి వార్తల్లో నిలిచారు. ప్రధాని మోడీ మహానటుడని… ఆయనకు అస్కార్ కాకపోయినా భాస్కర్ అవార్డు ఇవ్వాల్సిందేనని ఎద్దేవా చేశారు.

పతనమవుతున్న రూపాయి విలువ గురించి అప్పటి కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ 2013లో ఆయన చేసిన ఉపన్యాసం మామూలుగా లేదని… ఆయన హావభావాలు, నటనకు గాను ఆయనను తాను అవార్డుకు నామినేట్ చేస్తున్నానని తెలిపారు. మోడీని విశ్వ గురువుగా, నోబెల్ కంటే గొప్ప వ్యక్తిగా భావించే బీజేపీ శ్రేణులకు ఈ విషయాన్ని చెపుతున్నానని తెలియజేసారు.

మోదీ గారు నోబెల్ ప్రైజుకు అర్హులే… కానీ ఏ కేటగిరిలో? అంటూ కేటీఆర్ కింది ఆప్షన్లు ఇచ్చారు.

మెడిసిన్ లో నోబెల్ – కరోనా వ్యాక్సిన్ కనుక్కున్నందుకు
ఆర్థికశాస్త్రంలో నోబెల్ – పెద్ద నోట్ల రద్దు, స్విస్ బ్యాంకుల నుంచి నల్ల ధనాన్ని వెనక్కి రప్పించడం
నోబెల్ శాంతి పురస్కారం – రష్యా – ఉక్రెయిన్ యుద్ధాన్ని 6 గంటల పాటు ఆపినందుకు
భౌతికశాస్త్రంలో నోబెల్ – రాడార్ థియరీకి … అంటూ ట్వీట్ చేశారు.