నేడు పట్టణ ప్రగతిపై సమీక్ష నిర్వహించనున్నమంత్రి కేటీఆర్‌

హైదరాబాద్ : మంత్రి కేటీఆర్‌ నేడు పట్టణ ప్రగతి కార్యక్రమంపై సమీక్ష నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లో జరగనున్న ఈ సమావేశానికి మేయర్లు, మున్సిపల్‌ చైర్‌పర్సన్లు, కమిషనర్లు, మున్సిపల్‌ శాఖ ఉన్నతాధికారులు హాజరవుతారు. ఈ సందర్భంగా పట్టణ ప్రగతి కార్యక్రమ విధివిధానాలపై చర్చిస్తారు. ప్రజాప్రతినిధులు, అధికారులకు మంత్రి కేటీఆర్‌ దిశానిర్ధేశం చేయనున్నారు.

రాష్ట్రంలోని నగరాలు, పట్టణవాసులకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రగతి కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా వార్డుల వారీగా అభివృద్ధి కార్యక్రమాల సమీక్ష, సీజనల్‌ వ్యాధుల నివారణ కోసం పారిశుధ్య కార్యక్రమాలు, నీటి నిల్వల తొలగింపు, దోమల నివారణకు మందుల స్ప్రేయింగ్‌, చెత్త తొలగింపు, రహదారుల వెంట పిచ్చి మొక్కలు, భవన నిర్మాణ వ్యర్థాల తొలగింపు, శిథిల భవనాల కూల్చివేత, ఖాళీ స్థలాల్లో హరితహారం వంటి పనులను నిర్వహిస్తారు. ఐదోవిడత పట్టణ ప్రగతి కార్యక్రమం ఈ నెల 20 నుంచి జూన్‌ 5 వరకు జరుగనుంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/