జయశంకర్ సార్ నడిపిన పోరాటం స్ఫూర్తిదాయకంః మంత్రి కెటిఆర్

హైదరాబాద్ః నేడు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రదాత ప్రొఫెసర్ జయశంకర్ జయంతి. ఈ సందర్భంగా నివాళులర్పించారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణ శ్వాసగా.. తెలంగాణే ధ్యాసగా జయశంకర్ సార్ నడిపిన పోరాటం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. మీరు గడిపిన జీవితం మహోన్నతం.. స్వరాష్ట్రంలో తెలంగాణ సాగిస్తున్న ప్రగతి ప్రస్థానం సాక్షిగా.. మీకివే మా నివాళులు.. జోహార్ Prof. జయశంకర్ సార్ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
ప్రొఫెసర్ జయశంకర్‌తో తమకు ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకుంటున్నారు. జయశంకర్‌తో కలిసి తాను తెలంగాణ కోసం నినాదాలు చేస్తున్న సందర్భంగా తీసిన ఫొటోనపు కేటీఆర్ పంచుకున్నారు. హన్మకొండలో 2009 నవంబర్ 29న జయశంకర్ ఇంటిలో ఈ ఫొటో తీశారని ఆయన వెల్లడించారు. తెలంగాణ కోసం నిరాహార దీక్ష చేస్తున్న కేసీఆర్‌ను అలుగునూర్ వద్ద పోలీసులు అరెస్ట్ చేయగా… దానికి నిరసనగా తాను జయశంకర్‌తో కలిసి నినదించానని, ఆ తర్వాతి రోజు తమను కూడా పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పారు. తనను వరంగల్ జైలుకు తరలించిన పోలీసులు జయశంకర్‌ను మాత్రం ఖమ్మం జైలుకు తరలించారని కేటీఆర్ వివరించారు. తనకు ఇష్టమైన ఫొటోల్లో ఇదీ ఒకటి అంటూ ఆయన తెలిపారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/