ప్రతి గ్రామంలో మంకీ ఫుడ్‌ కోర్టులు ఏర్పాటు

కరీంనగర్‌లో హరితహారంలో పాల్గొన్న మంత్రి కెటిఆర్‌

Minister KTR participates In Harithaharam

కరీంనగర్‌: మంత్రి కెటిఆర్‌ కరీంనగర్‌ జిల్లాలోని చొప్పదండిలో హరితహారం నిర్వహించారు. ఈ సందర్భంగా కెటిఆర్‌ మాట్లాడుతూ..కరోనాతో సహజీవనం చేస్తున్నామని.. కరోనా వచ్చినా.. రాష్ట్ర ప్రగతి ఆగలేదన్నారు. సంక్షోభంలోనూ సంక్షేమానికి పెద్దపీట వేశారన్నారు. రైతాంగానికి పెద్ద పీట వేశామన్నారు. ఇప్పుడు ఎన్నికలేవీ లేవని.. 85 శాతం మొక్కలు బతక్కపోతే సర్పంచ్ పదవి పోతుందన్నారు. హరితహారానికి.. రాజకీయానికీ సంబంధం లేదన్నారు. కరీంనగర్‌లోనే అటవీ శాతం తక్కువ ఉందన్నారు. ప్రతి గ్రామంలో మంకీ ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేశారని కెటిఆర్‌ తెలిపారు. గ్రామాల్లో నాటిన మొక్కల్లో 85 శాతం బతకకపోతే… గ్రామ సర్పంచ్ పదవి పోయేలా పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చామని తెలిపారు. కెసిఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగమిస్తోందని చెప్పారు. అన్ని సంక్షేమ కార్యక్రమాలను ఆపకుండా చేస్తున్నామని అన్నారు. కరోనా సంక్షోభ సమయంలో కూడా పథకాలు ఆగలేదని చెప్పారు. కరీంనగర్ జిల్లాలో అడవుల శాతం తక్కువ ఉందన్నారు. ఈ కార్యక్రమం వల్ల భవిష్యత్ తరాలకు మేలు జరుగుతుందని అన్నారు. చెట్లను కాపాడుకోలేకపోతే… రాబోయే రోజుల్లో గాలిని కూడా కొనుక్కునే రోజులు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/