మహీంద్రా యూనివర్సిటీ ప్రారంభంలో కెటిఆర్‌

మహీంద్ర గ్రూప్‌కి శుభాకాంక్షలు తెలిపిన కెటిఆర్‌

launching-the-mahindra-university

హైదరాబాద్‌: కుత్బుల్లాపూర్‌ మండలం బహదూర్‌పల్లిలో ఈ రోజు ‘మహీంద్రా’ విశ్వవిద్యాలయం ప్రారంభమైంది. ఆన్‌లైన్‌ వేదికగా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ అభిప్రాయాలు తెలిపారు. ఈ సందర్భంగా కెటిఆర్‌ మాట్లాడుతూ.. వర్సిటీ రూపకల్పనలో ఆనంద్‌ మహీంద్రా క్రియాశీలక పాత్ర వహించారని కొనియాడారు. ఈ యూనివర్సిటీ అంతర్జాతీయ ప్రమాణాలను నెలకొల్పుతుందన్నారు. మహీంద్రా వర్సిటీ ఇన్నోవేషన్‌కు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి సూచించారు. వర్సిటీ ప్రారంభం సందర్భంగా మహీంద్రా గ్రూపునకు కెటిఆర్‌ అభినందనలు తెలిపారు.

ఆనంద్‌ మహీంద్రా మాట్లాడుతూ.. నూతనంగా యూనివర్సిటీని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. భావితరాలకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రతి 8 మంది భారతీయుల్లో ఒకరు మాత్రమే కాలేజీకి వెళ్తున్నారు. ఇప్పుడు నలుగురిలో ఒకరు కాలేజీకి వెళ్లేలా చేయాలన్నారు. విదేశాల్లో చదువుకునే భారతీయ విద్యార్థుల కోసం 1950ల్లోనే కేసీ మహీంద్రా స్కాలర్‌షిప్‌లు ఇవ్వడం జరిగిందని ఆయన గుర్తు చేశారు.

మహీంద్రా యూనివర్సిటీకి ఆనంద్‌ మహీంద్రా వీసీగా వ్యవహరించనున్నారు. 130 ఎకరాల విస్తీర్ణంలో వర్సిటీని ఏర్పాటు చేశారు. ఈ విశ్వవిద్యాలయంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ స్థాయిలో మేనేజ్‌మెంట్‌, మీడియా, లా, ఎడ్యుకేషన్‌, లిబరల్‌ ఆర్ట్స్‌, డిజైన్‌ కోర్సులను ఆఫర్‌ చేయనున్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/