ఏడో విడత హరితహారం ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్ : మంత్రి కేటీఆర్‌ ఏడో విడత హరితహారం కార్యక్రమానికి ప్రారంభించారు. ఇందులో భాగంగా నగరంలోని పెద్దఅంబర్‌పేట కలాన్‌లోని ఏర్పాటు చేసిన అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కును కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్క్‌లో మొక్కలు నాటి ఏడో విడత హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు మహేందర్‌రెడ్డి, సురభి వాణీదేవి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తాజా వీడియో వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/videos/