సిరిసిల్లలో రైతు బజార్‌ను ప్రారంభించిన మంత్రి కెటిఆర్‌

ఇతర జిల్లాలకు ఆదర్శవంతంగా సిరిసిల్లలో అభివృద్ధి..కెటిఆర్‌

Minister KTR launches rythu Bazaar in Sircilla

సిరిసిల్ల: ఐటీ, పురపాకల శాఖ మంత్రి కెటిఆర్‌ సిరిసిల్ల పట్టణంలో రూ.5.15కోట్ల తో అధునాతన రైతు బజార్ ను ప్రారంభించారు. అనంతరం మార్కెట్ లో రైతులు, వ్యాపారులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇతర జిల్లాలకు ఆదర్శవంతంగా సిరిసిల్లలో అభివృద్ధి జరుగుతున్నదన్నారు. రోహిణి కార్తెలో కూడా చెరువులు నింపడం సిఎం కెసిఆర్‌ పనితనానికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ను మూడేండ్లలో పూర్తి చేయడం సిఎం కెసిఆర్‌ పనితీరుకు అద్దం పడుతుందన్నారు. కాలంతో పొటీ పడి కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తి చేసుకున్నామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు రైతుబంధు, రైతుబీమా అందజేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. సంక్షోభంలోనూ ఒక్క రోజులోనే 50 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమ అయ్యాయని తెలిపారు. ఈ ఏడాది రూ. 25 వేల లోపు రుణమాఫీ ఒకసారి అమలు చేశామని వెల్లడించారు. వ్యవసాయ రంగానికి మహర్ద దశ పట్టనుందని, విదేశాలకు చేపలు, రొయ్యలు ఎగుమతి చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. రైతును రాజును చేయడమే ప్రభుత్వ సంకల్పమన్నారు. వ్యాపారులు మార్కెట్ లో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని సూచించారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/