డిఆర్‌ఎఫ్‌ వాహనాలను ప్రారంభించిన కెటిఆర్‌

minister KTR
minister KTR

హైదరాబాద్‌: టిఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీశాఖ మంత్రి కెటిఆర్‌ జిహెచ్‌ఎంసి పరిధిలో నేడు విపత్తు నిర్వహణ వాహనాలను ప్రారంభించారు. అత్యాధునిక పరికరాలు, సదుపాయాలతో విపత్తు నిర్వహణ వాహనాలను రూపొందించినట్లుగా మంత్రి కెటిఆర్‌ తెలిపారు. ప్రతి వాహనంలో ఏడు రకాల రక్షణ పరికరాలు అందుబాటులో ఉంచనున్నట్లు ఆయన వెల్లడించారు. అంతేకాకుండా ప్రతి వాహనంలో ఆరు రకాల బాక్స్‌లను అమర్చడం జరిగిందని ఆయన అన్నారు. మెడికల్‌ కిట్‌, హెల్మెట్‌, గమ్‌ బూట్స్‌, మిగతా బాక్స్‌ల్లో రక్షణ పరికరాలు ఉంటాయని కెటిఆర్‌ చెప్పారు. ఇంకా ఈ వాహనాల్లో 500 మీటర్ల మేర వెలుతురు వచ్చేలా ఆస్కా లైట్లలను అమర్చినట్లు ఆయన పేర్కొన్నారు. గురువారం నెక్లెస్‌ రోడ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎనిమిది డిఆర్‌ వాహనాలను ఆయన ప్రారంభించారు. కాగా ఈ కార్యక్రమంలో జిహెచ్‌ఎంసి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ విశ్వజిత్‌ కంపాటి, జిహెచ్‌ఎంసి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh