రంగారెడ్డి జిల్లాలో ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు శంకుస్థాప‌న

రంగారెడ్డి: మంత్రి కేటీఆర్ రంగారెడ్డి జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. ఈసందర్బంగా మంత్రి కేటీఆర్ జిల్లాలోని మ‌హేశ్వ‌రంలో ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు శంకుస్థాప‌న చేశారు. ఈసంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ…న‌గ‌ర శివారు ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్నామ‌న్నారు. ఇవాళ ఒక్క‌రోజు రూ.400కోట్ల ప‌నుల‌కు శ్రీకారం చుట్టామ‌న్నారు. మీర్ పేట్, బడంగ్ పేట్ లో రోడ్ల విస్త‌ర‌ణ ప‌నులు, నాన్ వెజ్, వెజిట‌బుల్ మార్కెట్ కు శంకుస్థాప‌న చేశామ‌న్నారు. అలాగే ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించామ‌న్నారు. త్వ‌ర‌లోనే ఎయిర్ పోర్టుకు ప్ర‌త్యామ్నాయ రోడ్డు ఏర్పాటు చేస్తున్నామ‌న్నారు. శివారు మున్సిపాలిటీల్లోనూ బ‌స్తీ ద‌వాఖాన‌ల‌ను ఏర్పాటు చేస్తామ‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర మంత్రి స‌బితా ఇంద్రారెడ్డితో పాటు ప‌లువురు నేత‌లు పాల్గొన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/