స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ను ప్రారంభించిన మంత్రి కెటిఆర్‌

రెండు బ్యాడ్మింటన్ కోర్టులు, జిమ్, యోగా హాల్, స్నూకర్ రూమ్

minister-ktr-inaugurates-sports-complex

హైదరాబాద్‌: రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కెటిఆర్‌ స‌న‌త్ న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో రూ. 5 కోట్ల‌తో నిర్మించిన స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ ను ప్రారంభించారు. ఇందులో రెండు బ్యాడ్మింటన్ కోర్టులు, జిమ్, యోగా హాల్, స్నూకర్ రూమ్, క్యారమ్స్, టేబుల్ టెన్నిస్ తదితర సౌకర్యాలు కల్పించారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రారంభం సంద‌ర్భంగా అక్క‌డ ఏర్పాటు చేసిన స‌మావేశంలో కెటిఆర్ ప్ర‌సంగించారు.. ప్ర‌జ‌ల క‌ష్టాలు, అవ‌స‌రాలు తెలుసుకుని వాటిని తీర్చే వారే అస‌లైన నాయ‌కులు అని కెటిఆర్ అన్నారు. త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ ఆధ్వ‌ర్యంలో స‌న‌త్ న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధిలో దూసుకుపోతోంది అని స్ప‌ష్టం చేశారు.

రాష్ర్టం ఏర్ప‌డ్డ స‌మ‌యంలో అనేక అనుమానాలు ఉండేవి. అప్పుడు క‌రెంట్ ఉంటే వార్త‌.. నాడు నీళ్లు వ‌స్తే వార్త‌. అప్పుడు సుస్తీ ఎక్క‌డికి పోవాలో తెలియ‌ని ప‌రిస్థితి. కానీ తెలంగాణ ప్ర‌భుత్వంలో అలాంటి స‌మ‌స్య‌లు లేవు. 24 గంట‌లు నాణ్య‌మైన విద్యుత్‌ను ఇస్తున్నాం. ప్ర‌తి ఇంటికి మంచినీరు అందిస్తున్నాం. పేద‌ల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని బ‌స్తీ ద‌వాఖానాలు ఏర్పాటు చేసుకున్నాం.. ఇలా హైద‌రాబాద్‌లో అనేక అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేప‌ట్టామ‌ని తెలిపారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/