సిరిసిల్ల కలెక్టరేట్‌లో జాతీయజెండా ఎగరవేసిన మంత్రి కేటీఆర్‌

తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా మంత్రి కేటీఆర్‌..సిరిసిల్ల కలెక్టరేట్‌లో జాతీయజెండా ఎగరవేశారు. అలాగే శాసన సభ ఆవరణలో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, శాసన మండలి వద్ద చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. అనంతరం అసెబ్లీ ఆవరణలోని మహాత్మా గాంధీ, బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ విగ్రహాలను నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కార్యదర్శి వీ నరసింహా చార్యులు, పలువులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు. రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్య పాలనవైపు అడుగులేసిన తెలంగాణ నేడు సమైక్యతా దినోత్సవం జరుపుకుంటున్నది. స్వరాష్ట్రంగా మారి సీఎం కేసీఆర్‌ సారథ్యంలో ప్రగతి పథంలో పయనిస్తూ దేశంలో నంబర్‌ వన్‌గా మారిందని ట్విట్టర్‌ వేదికగా ప్రజలకు శుభాకాంక్షాలు తెలిపారు.

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ , బిజెపి పార్టీలు పోటాపోటీగా వేడుకలు జరుపుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సర్కార్ తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలు జరుపుతుంటే..బిజెపి తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు జరుపుతుంది. ప్రస్తుతం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో కేంద్ర సర్కార్ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాలు జరుగుతున్నాయి. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా జాతీయ జెండా ఆవిష్కరించి విమోచన దినోత్సవాలను ప్రారంభించారు. మరోపక్క తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా ఈరోజు మధ్యాహ్నం ఎన్టీఆర్‌ స్టేడియంలో సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఇలా మొత్తం మీద బీజేపీ , టిఆర్ఎస్ పార్టీ లు ఎక్కడ తగ్గకుండా పోటా పోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తుంది.