లఖీంపూర్‌ ఖేరీ ఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది: కేటీఆర్

హైదరాబాద్: తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ఉత్తర్ ప్రదేశ్ లోని లఖీంపూర్‌ ఖేరీ ఘటనపై స్పందించారు. యూపీ ఘటన దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆయన అన్నారు. నిందితులకు కఠిన శిక్ష విధించాలని తెలిపారు. ఉత్తర ప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరిలో రైతుల నిర్దాక్షిణ్యమైన, కోల్డ్ బ్లడెడ్ మర్డర్‌ను చూసి షాక్, భయం వేసిందన్నారు. ఈ అనాగరిక సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను అని తెలిపారు. బాధిత కుటుంబాలకు వీలైనంత త్వరగా న్యాయం చేయాలని చెప్పారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్‌ చేశారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/