కొండా లక్ష్మణ్ బాపూజీ కి నివాళులు అర్పించిన కెటిఆర్‌

minister-ktr-celebrates-konda-lakshman-bapuji-birth-anniversary

హైదరాబాద్‌ః ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు.. కొండా లక్ష్మణ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఆయన.. ‘ఏ జలదృశ్యంలో అయితే ఉద్యమనాయకుడు కెసిఆర్ నాయకత్వంలో టిఆర్ఎస్ ఉద్భవించిందో, ఏ జలదృశ్యంలో అయితే అవమానకరంగా అప్పటి ప్రభుత్వం కూల్చివేసిందో.. ఈ రోజు అక్కడే శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించుకున్నాం. తెలంగాణ ఆత్మగౌరవ పతాకాన్ని సమున్నతంగా ఎగురవేశాం’ అని పేర్కొన్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/