వరంగల్‌లో మంత్రులు కెటిఆర్‌, ఈటల పర్యటన

Minister KTR and Etela

వరంగల్‌: గత ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరంగల్‌ నగరం అతలాకుతం అయింది. జనజీవనం స్తంభించిపోయింది. దీంతో సిఎం కెసిఆర్‌ ఆదేశాల మేరకు ఈరోజు వరంగల్‌లో ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్‌, ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ నగరానికి చేరుకున్నారు. వరద ముంపు ప్రాంతాల్లో మంత్రులు పర్యటించనున్నారు. స్థానిక మంత్రులతో కలిసి ఏరియల్ సర్వే చేయనున్నారు. అనంతరం ముంపు ప్రాంతాల్లో పర్యటించి తర్వాత ప్రజాప్రతినిధులు, అధికారులతో మంత్రి కెటిఆర్‌ సమీక్ష నిర్వహించనున్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/