రూ.100 కోట్లతో 125 అడుగుల ఎత్తులో అంబేద్కర్ విగ్రహం

మీడియాకు వివరాలు తెలిపిన మంత్రి కొప్పుల ఈశ్వర్

హైదరాబాద్: హైదరాబాదు నగరంలోని హుస్సేన్ సాగర్ తీరంలో రూ.100 కోట్లతో అంబేద్కర్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. ఈ విగ్రహం ఎత్తు 125 అడుగులు. దీనికోసం రూ.100 కోట్లకు టెండర్లు పిలవాలని టీఆర్ఎస్ సర్కారు నిర్ణయించింది.

ఈ అంబేద్కర్ మహా విగ్రహం గురించిన వివరాలను మంత్రి కొప్పుల ఈశ్వర్ మీడియాకు తెలిపారు. ఈ విగ్రహం కిందిభాగంలో 50 అడుగుల మేర పార్లమెంటు ఆకృతిలో ఓ భవంతి ఉంటుందని, దానిపైన విగ్రహ నిర్మాణం ఉంటుందని వివరించారు. గరిష్ఠంగా 15 నెలల కాలంలో ఈ విగ్రహం నిర్మాణం పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటామని కొప్పుల ఈశ్వర్ తెలిపారు. అంబేద్కర్ గొప్పదనాన్ని ప్రతిబింబించేలా విగ్రహ నిర్మాణం ఉంటుందని వివరించారు. విగ్రహ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించిన అనంతరం ఆయన ఈ మేరకు మీడియాతో మాట్లాడారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/