‘ఆరోగ్య శ్రీ’లో కరోనా చికిత్సను చేర్చిన ఏకైక రాష్ట్రం ఏపీ

మంత్రి కొడాలి నాని

AP Minister Kodali Nani
AP Minister Kodali Nani

Amaravati: వైకాపా ప్రభుత్వం ఆధికారం చేపట్టి రెండేళ్లు పూర్తి అయిన సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడారు. 2014 లోనే జగన్ ని సీఎం గా ఎన్నుకుంటే బావుండేది అని జనం భావిస్తున్నారని అన్నారు. 2014లో చంద్రబాబుకు అధికారం ఇచ్చి తప్పు చేశామని కొందరు బాధ పడుతున్నారని పేర్కొన్నారు. ఈ రెండేళ్ల పరిపాలనలో కుల మతాలకి అతీతంగా జగన్ పాలన పై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.

గడిచిన రెండేళ్లలో సంక్షేమ అభివృద్ధి పై వైసీపీ ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. లక్ష కోట్లకు పైగా సంక్షేమాన్ని వివిధ వర్గాలకు దక్కిందని తెలిపారు. ఆరోగ్య శ్రీలో కరోనా చికిత్సను చేర్చిన ఏకైక రాష్ట్రం ఆంధ్రపదేశ్ అని మంత్రి కొడాలి నాని అన్నారు.

కరోనాతో తల్లిదండ్రులు చనిపోయి అనాధలైన పిల్లలకు రూ. 10 లక్షల డిపాజిట్ చేసి సీఎం జగన్ దేశానికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఒక మెడికల్ కాలేజి వస్తోందన్నారు. 75 ఏళ్ల చరిత్రలో ఇలాంటి విప్లవాత్మక మార్పులు లేవని, కేవలం రెండేళ్లలోనే ఇది జరిగిందన్నారు. ఎన్టీఆర్ కి ‘భారతరత్న’ ఆపిన దుర్మార్గుడు చంద్రబాబు అని మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/