నేడు హన్మకొండలో పర్యటించనున్న మంత్రి కెటిఆర్‌

minister-kcr-will-visit-hanamkonda-today

హైదరాబాద్ః మంత్రి కెటిఆర్‌ నేడు హన్మకొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కెటిఆర్‌ వేలేరు మండలంలో రూ.133కోట్లతో చేపట్టిన ఇరిగేషన్ ప్రాజెక్ట్ తోపాటు పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్స వాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు సోడషపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కెటిఆర్ పాల్గోననున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు,ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే రాజయ్యలు పాల్గొననున్నారు. మరోవైపు పీజీ మెడికల్​ స్టూడెంట్ ప్రీతి అంత్యక్రియల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో మంత్రి కెటిఆర్ పర్యటను పోలీసులు భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు.