హుజూర్‌నగర్‌లో టిఆర్‌ఎస్ కి భారీ మెజారిటీ

మెజారిటీ కోసమే ప్రచారం

Jagdish Reddy
Jagdish Reddy

హైదరాబాద్: టిఆర్‌ఎస్ గెలిస్తే ప్రజలకు లాభం అనేనినాదంతో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకు వెళ్లాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. హుజూర్‌నగర్ ఉపఎన్నికల్లో ఇదేనినాదంతో ప్రజల్లోకు వెళ్లాలని ఆయన పార్టీ శ్రేణులను కోరారు. హుజూర్‌నగర్ ఉపఎన్నికల్లో టిఆర్‌ఎస్ గెలుపు ఖాయం అయినప్పటికీ మెజారిటీకోసం ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లనున్నట్లు ఆయన చెప్పారు. గురువారం టిఆర్‌ఎస్ కార్యాలయంలో హుజూర్‌నగర్ ఉపఎన్నికలపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమీక్షలో మంత్రి జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ ఆత్మవిశ్వాసంతో ఎన్నికలప్రచారంలో పాల్గొనాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని అన్ని ప్రాతంతాలను సమానంగా అభివృద్ధిచేస్తూ ఆదర్శనీయమైన పథకాలను అమలుచేస్తున్న టిఆర్‌ఎస్ ప్రభుత్వంపై ప్రజలకు ఉన్ననమ్మకమే హుజూర్‌నగర్‌ఎన్నికల్లో భారీ మెజారిటీ తెస్తుందని చెప్పారు. అయితే గెలుపు ఖాయమైనప్పటికీ భారీమెజారిటీని నమోదు చేసేందుకు హూజూర్‌నగర్‌లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేయాలని చెప్పారు. ప్రధానంగా ప్రభుత్వ సంక్షేమ అభివృద్ది పథకాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకువెళ్లాలని ఆయన చెప్పారు. అభివృద్ధి నినాదమే హుజూర్‌నగర్‌ఎన్నికల ప్రచార అస్తృం కావాలని చెప్పారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/