ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలో మంత్రి జగదీశ్‌ రెడ్డి

Education Minister G Jagadish Reddy
Education Minister G Jagadish Reddy

సూర్యాపేట: మంత్రి జగదీశ్‌రెడ్డి సూర్యాపేట నియోజకవర్గంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు గ్రామాల్లో ఎటుచూసిన టిఆర్‌ఎస్‌ అభ్యర్థులకు అద్భుతమైన స్పందన లభిస్తుంది. దీనికి కారణం సిఎం కెసిఆర్‌. కెసిఆర్‌ ఐదు సంవత్సరాల పరిపాలన అనుభవమే ప్రజలను ఆ ఆవిధంగా ఆలోచింపచేస్తుంది. సమస్యలు ఇంకా ఉన్నాయంటే అది కాంగ్రెస్, టీడీపీల పుణ్యమే అరవై ఏళ్ళు పాలించిన వీళ్ళు తెలంగాణాలోని గ్రామాలను నాశనం చేసినారు. మన నీళ్లను, మన కరెంట్ ను, మన ఖజాన సొమ్మును మనకు లేకుండా చేసి ఆంధ్రకు తరలించారు . ప్రతీ రైతూ లక్షాధికారి కావాలనేది ముఖ్యమంత్రి కెసిఆర్‌ గారి లక్ష్యం. టీఆర్ఎస్ పార్టీ నిలిపిన ఎంపీటీసీ, జెడ్పీటీసీలను గెలిపించి జరుగబోయే అభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.


మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/