పల్లె పగ్రతిలో కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి జగదీశ్‌రెడ్డి

నల్లగొండ : ఈరోజు దేవరకొండ నియోజకవర్గంలో మంత్రి జగదీశ్‌రెడ్డి పర్యటించారు. చందంపేట మండల కేంద్రంలో సకల సదుపాయాలతో నిర్మించిన డబుల్‌ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొని, మొక్కలు నాటారు. ప్రజలంతా కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పచ్చదనం, పరిశుభ్రతే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ చేపట్టిన పల్లె పగ్రతి కార్యక్రమం ద్వారా విప్లవాత్మక మార్పులు వస్తాయన్నాని జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే ఎలాంటి జబ్బులు రావని, దోమల నివారణ ప్రధాన కార్యక్రమంగా చేపట్టాలని అధికారులకు సూచించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/