వేములవాడ ఆలయాన్ని ఆధునీకరిస్తున్నాం

Minister Indrakaran Reddy -Vemulawada
Minister Indrakaran Reddy -Vemulawada

సిరిసిల్ల : వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. వేములవాడ ఎంఎల్ఎ చెన్నమనేని రమేష్ తో కలిసి మంత్రి కాళేశ్వరం జలాలను మిడ్ మానేరు ద్వారా వేములవాడ ఆలయ చెరువులోకిఈరోజు విడుదల చేశారు. అనంతరం గుడి చెరువు వద్ద మంత్రి ఇంద్రకరణ్, ఎంఎల్ఎ రమేష్ లు ప్రత్యేక పూజలు చేసి గంగమ్మకు హారతి ఇచ్చారు. రూ.400 కోట్లతో వేముల వాడ ఆలయాన్ని ఆధునీకరిస్తున్నామని మంత్రి చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో కలెక్టర్ కృష్ణ భాస్కర్, జడ్ పి చైర్ పర్సన్ అరుణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మొక్కులు చెల్లించుకున్నారు. మహామండపంలో ఇంద్రకరణ్ రెడ్డికి ఆలయ ఇఒ కృష్ణవేణి రాజన్న చిత్రపటంతో పాటు స్వామివారి శేషవస్త్రాలు, తీర్థ ప్రసాదాలను అందించారు.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/