వేములవాడ రాజ‌న్నకు ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించిన మంత్రి

వేముల‌వాడ: ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా శ్రీ రాజరాజేశ్వరస్వామి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి దంపతులు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించారు. వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

అనంత‌రం కుటుంబ స‌మేతంగా మంత్రి అల్లోల‌ స్వామివారిని ద‌ర్శించుకున్నారు. దర్శనానంతరం వేద‌పండితులు ఆశీర్వచనాలను అందించారు. శివ‌రాత్రి మ‌హోత్సవాల‌కు హాజరయ్యే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజ‌ల‌కు మ‌హాశివ‌రాత్రి శుభాకాంక్షలు తెలిపారు. స్వామి వారి దివేనతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/