ఆయనతోనే బంగారు తెలంగాణ సాధ్యం

Indrakaran Reddy
Indrakaran Reddy

ఆదిలాబాద్‌: అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకిరణ్‌ రెడ్డి ఈరోజు బాసర మండలం బిద్రెల్లిలో టిఆర్‌ఎస్‌ జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చి స్వరాష్ట్రాన్ని తెచ్చిన సిఎం కెసిఆర్‌ తెలంగాణ‌ను అన్నివిధాలా అభివృద్ధి చేస్తూ దేశంలోనే నంబర్ వన్‌గా నిలుపుతున్నారని, ఆయనతోనే బంగారు తెలంగాణ సాధ్యమని మంత్రి అల్లోల అన్నారు. కోట్లాది రూపాయలు వెచ్చించి రైతుల కోసం నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మణం త్వరలో పూర్తి అయి కోటి ఎకరాలకు సాగునీరందబోతుందని అన్నారు. రైతును రాజుగా చేసేందుకు సీఎం కేసీఆర్ అనేక సాగునీటి ప్రాజెక్ట్ ల‌ను చేప‌ట్ట‌డంతో పాటు అనేక సంక్షేమ కార్య‌క్ర‌మాలు అమ‌లు చేస్తున్నార‌ని తెలిపారు.


మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/