జంగిల్‌ పార్క్‌ ప్రారంభోత్సవంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

Indrakaran Reddy
Indrakaran Reddy

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా పెద్ద గోల్కొండ సమీపంలో సుమారు 400 ఎకరాల్లో ఏర్పాటు చేసిన అర్బ‌న్ ఫారెస్ట్ పార్క్ (మ‌సీదుగ‌డ్డ జంగిల్ క్యాంప్) ను ప్రారంభించిన మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రా రెడ్డి. ఈ పార్క్‌లో సాహసక్రీడల కోసం అడ్వెంచర్‌ జోన్‌ను, రాత్రి పూట నివాసముండేలా జంగిల్‌ క్యాంప్‌లను రూపుదిద్దారు. సైక్లింగ్‌, ట్రెకింగ్‌ తోపాటు సందర్శకుల రక్షణకు వీలుగా జంగిల్‌ క్యాంపింగ్‌ ఏరియా చుట్టూ చైన్‌ లింక్డ్‌ ఫెన్స్‌ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నడూ లేని విధంగా అడవుల సంరక్షణ, అభివృద్ధికి సిఎం కెసిఆర్‌ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన అన్నారు. పట్టణాలకు దగ్గరగా నిరుపయోగంగా ఉన్న రిజర్వ్‌డ్‌ బ్లాక్‌లను ప్రజలకు ఉపయోగ పడే విధంగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో పార్క్‌ను ఒక్కో థీమ్‌తో మొత్తం 94 పార్క్‌లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిదన్నారు. పట్టణ వాసులకు శారీరక ధారుడ్యం, మానసిక ఉల్లాసంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడమే అర్బన్‌ ఫారెస్ట్‌ పార్క్‌ల ముఖ్య ఉద్దేశం అని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/