ఓటేసిన పలువురు ఎమ్మెల్యెలు

ZPTC, MPTC Election nominations
ZPTC, MPTC Election nominations

హైదరాబాద్‌: రెండో విడత పరిషత్‌ పోలింగ్‌ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతుంది. ప్రజాప్రతినిధులు ఆయా నియోజకవర్గాల పరిధిలోని పోలింగ్‌ కేంద్రాల్లో తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి త‌న స్వ‌గ్రామం ఎల్ల‌ప‌ల్లిలో కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ఓటు వేశారు.వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండలం గోవిందపూర్ పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థిని గండ్ర జ్యోతి ఓటేశారు.గంగాధర మండలం బూరుగుపల్లి లో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. మహబూబాబాద్ జిల్లాలోని పెద్ద తండాలోఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని కౌడిపల్లిలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి దంపతులు ఓటేశారు. నర్సాపూర్ మండలంలో ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. మహబూబ్ నగర్ ర్ జిల్లా కోయిలకొండ మండలం శేరివెంకటాపూర్ లో నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.


మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/