తెలంగాణాలో కొత్తగా ౩౩ కాలేజీలు : మంత్రి హరీష్ రావు

హైదరాబాద్: నేడు అసెంబ్లీలో మంత్రి హరీష్ రావు కేంద్రం పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 157 మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదని విరుచుకపడ్డారు. ఒక్కో కాలేజీకి 200 కోట్లు మంజూరు చేసిన కేంద్రం.. తెలంగాణకు తీవ్ర వివక్ష చూపిందన్నారు. తెలంగాణ రాకా ముందు ౩ మెడికల్ కాలేజీలు ఉంటే, ఇప్పుడు ౩౩ కి పెంచుకుందామాన్ని హరీష్ రావు తెలిపారు. వైద్య విద్య కోసం బాషా రాకపోయినా చైనా,ఉక్రెయిన్ ఇతర దేశాలకు వెళ్లిన మన విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని మంత్రి తెలిపారు. సీఎం కెసిఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా జిల్లాకొక మెడికల్ కాలేజీ లేకపోవడం వల్ల విద్యార్థులు ఇక్కడే విద్యను చదువుకోవడం సులువు కాదని చెప్పారు.

మంత్రి కెసిఆర్ ఆలోచనతో దేశంలో మొదటి సారి ఈ బస్తి దవాఖానాపై 15 వ ఆర్థిక సంఘ ప్రశంసలు కురిపించిందని చెప్పారు. 350 ఏర్పాటు చేయాలనీ నిర్ణయచంగా ,ప్రస్తుతం 259 సేవలు మాత్రమే అందిస్తున్నామని.. మిగితావి త్వరలోనే అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. బస్తీ దవాఖానల నుండి టెలి మెడిసిన్ సేవలు కూడా అందిస్తామని తెలియాశారు. 57 రకాల పరీక్షలు, నాణ్యమైన వైద్యం ఉచితంగా అందిస్తే పేద ప్రజలకు ఉపయోగపడుతుందాన్ని తెలిపారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి. https://www.vaartha.com/andhra-pradesh/